Jubilee Hills : జూబ్లీహిల్స్ ఫలితం ఏం నేర్పింది..?

Update: 2025-11-20 05:30 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు బయటకు రాగానే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ ఒక్కటే. ఈ రిజల్ట్ నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి? మూడు ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ బలహీనతలను స్పష్టంగా గ్రహించాలి. ఓటర్ల తీరు, పార్టీలు తీసుకున్న నిర్ణయాలు, లోకల్ లెవల్ డైనమిక్స్ ఈ ఫలితంపై ప్రభావం చూపాయి. కాంగ్రెస్ ఈసారి సరైన నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎప్పుడూ ప్రజలతో టచ్‌లో ఉండే నాయకుడిని టికెట్ ఇవ్వడం పార్టీకి భారీ ప్లస్ అయింది. వ్యక్తిగతంగా ప్రజలతో ఉండే, సమస్యలను ఫాలో అవుతూ ఉండే నాయకుడికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ స్ట్రాటజీ డైరెక్ట్‌గా పని చేసింది.

బీఆర్‌ఎస్ ఈసారి సోషల్ మీడియా హడావిడిని నమ్మి తప్పు చేసింది. ఆన్‌లైన్‌లో కనిపించే సపోర్ట్, గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా అవుతుందని ఈ ఫలితం మరోసారి నిరూపించింది. సిట్టింగ్ సీటు ఉన్న పార్టీగా బీఆర్‌ఎస్ మరింత స్ట్రాంగ్‌గా ఫీల్డ్‌లో పనిచేయాలి. కానీ ఆత్మవిశ్వాసం, సోషల్ మీడియా ఎకోచాంబర్స్‌పై ఆధారపడడం భారీ నష్టాన్ని తీసుకువచ్చింది. ఒకప్పుడు బీజేపీ కేడర్‌ యాక్టివ్‌గా ఉండేది. కానీ ఇటీవలి రోజులుగా కేడర్‌ను పట్టించుకోవడం తగ్గిపోయింది.

గ్రౌండ్ లెవల్ వర్కర్స్, బూత్ లెవల్ స్ట్రక్చర్‌ను సంరక్షించడం ఏ పార్టీకి అయినా అత్యవసరం. ఇది చేయకపోవడంతో బీజేపీ మూడో స్థానంలో పడిపోయింది. కేడర్ బలం లేకుండా ఓటు బలం రాదు అనేది స్పష్టమైంది. కాబట్టి కాంగ్రెస్ ఇదే వ్యూహాలతో ముందుకు వెళ్తే నిలదొక్కుకుంటుంది. బీఆర్ ఎస్, కేటీఆర్ సోషల్ మీడియాను వదిలి గ్రౌండ్ లెవల్లో పార్టీ కేడర్ నుంచి విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్తే బెటర్. ఇక బీజేపీ గతంలో మాదిరిగా యాక్టివ్ గా పనిచేయాలి. లేదంటే కష్టమే అవుతుంది.


Full View

Tags:    

Similar News