అక్రమ సంబంధం.. భర్తను బ్యాంకులోనే ఉతికి ఆరేసింది..
నాకు అన్యాయం చేస్తావా అంటూ చొక్క పట్టుకుని భర్తను చితకబాదింది.;
ఆమెను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప కూడా ఉంది. అయినా బుద్ది గడ్డి తిని ఇంకో మహిళతో ప్రేమాయణం సాగించాడు ఓ బ్యాంక్ మేనేజర్.. భార్యకి భర్త బాగోతం తెలిసింది.. అంతే బ్యాంక్‌కి వచ్చి అందరి ముందూ భర్త చొక్కా పట్టుకుని ఉతికి ఆరేసింది. వరంగల్‌లో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది.
వరంగల్‌కు చెందిన శ్రీనివాస్.. పోచమ్మ మైదాన్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అతడికి భార్య మీద ప్రేమ తగ్గినట్టుంది.. మరో మహిళతో సహజీవనం చేస్తూ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు.
భర్త అక్రమ సంబంధం తెలుసుకుని అతడిని నిలదీసింది. దాంతో ఇంటికి రావడం కూడా మానేశాడు. దీంతో ఆగ్రహించిన భార్య మంగళవారం బ్యాంకుకు వచ్చి అందరి ముందూ శ్రీనివాస్‌ను నిలదీసింది. నాకు అన్యాయం చేస్తావా అంటూ చొక్క పట్టుకుని భర్తను చితకబాదింది.
ఈ పరిణామానికి షాకైన సిబ్బంది ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది.