Secunderabad : మహంకాళి ట్రాఫిక్ పోలీసులపై కార్మికుల దాడి

Update: 2025-09-25 07:36 GMT

సికింద్రాబాద్.. ప్యాట్ని కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న మహంకాళి ట్రాఫిక్ పోలీసులపై ఇద్దరు కార్మికులు దాడికి పాల్పడ్డారు. మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రఘునందన్ పై ఓ షాపింగ్ మాల్ సమీపంలో దాడి జరిగింది. షాపింగ్ మాల్ సమీపంలో గత కొన్ని రోజులుగా మరమ్మతులు చేపడుతున్న క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రఘునందన్ రహదారిపై ఉన్న ఆటోను అక్కడి నుంచి తొలగించాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పనులు చేసుకోవాలని చెప్పారు. ఆగ్రహానికి గురైన ఇద్దరు కార్మికులు దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..

Tags:    

Similar News