TG : ట్రాఫిక్ పోలీస్ ఆపాడని ఆత్మహత్యాయత్నం

Update: 2024-09-11 15:00 GMT

శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు సాధారణ వాహన తనిఖీలు చేస్తున్నారు. అటుగా వచ్చిన ఓ వాహనదారుడిని ఆపి పత్రాల గురించి పోలీసులు అడగగా.. వారితో ఆ యువకుడు గొడవపడ్డాడు. సరైన పత్రాలు లేకుంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో.. ఆగ్రహించిన యువకుడు నన్నే బెదిరిస్తారా అంటూ.. బైక్ లోని పెట్రోల్ తీసి ఒంటిమీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News