ఒంటెపిల్లని కాపాడి... తల్లికి అప్పగించి..
గుంతలో పడిన ఒంటెపిల్లను చకచక్యంగా కాపాడిన వ్యక్తి...;
ప్రమాదవశాత్తూ ఓ గుంతలోకి జారిపడిన ఒంటె పిల్లను ప్రాణాలకు తెగించిన కాపాడాడు ఓ వ్యక్తి. ఎడారిలో ఎటవాలుగా ఉన్న కొండ ప్రాంతం మీద నుంచి తల్లితో పాటూ వెళుతోన్న ఒంటె పిల్ల పట్టుతప్పి లోతుగా ఉన్న ప్రాంతంలో చిక్కుకుపోయింది. తన చిన్నారిని ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లి ఒంటే నరకయాతన పడింది. బొరియ నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న చిన్నారి ఒంట అటుగా వెళుతోన్న వ్యక్తి కంట పడటంతో ధైర్య సాహసాలు కోర్చి తానూ గుంతలోకి దిగాడు. అప్పటికే బిత్తరపోయిన ఉన్న ఒంటె పిల్ల మరింత వణికిపోయింది. అయినప్పటికీ పట్టువదలని వ్యక్తి చాకచక్యంగా ఒంటెను పైకి లాక్కువచ్చాడు. తిరిగి పిల్ల ఒంటెను తల్లి దగ్గరకు చేర్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు వ్యక్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Helping this trapped baby camel get back safely to her mom.
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 18, 2023
A True Hero!! 🙏
We need more people like him in this world. 🐪❤🐫 pic.twitter.com/iKWpDk4xYD