Vietnam: ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకున్న తల్లి.. వీడియో వైరల్..
Vietnam: వియాత్నాంలో ఓ వ్యక్తి తన భార్య, పాపతో బైక్‌పై వెళ్తుండగా.. ఓ కారు ఓవర్‌టేక్ చేస్తూ.. వారిని తాకింది.;
Vietnam: పిల్లల క్షేమం కోసం పేరెంట్స్ ఎంతటి త్యాగమైనా చేస్తారు. తమ పిల్లలు ప్రమాదంలో ఉంటే కాపాడేందుకు తమ ప్రాణాలు సైతం అడ్డుపెడుతారు. ఇలా ఓ భారీ ప్రమాదం నుంచి ఓ తల్లి తన బిడ్డను కాపాడుకుంది. ఈ ఘటన 2019లోనే జరిగినా.. ఇంగ్లాండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ ఆ వీడియోను 'మదర్ ఆఫ్ ది ఇయర్' అంటూ ట్విటర్‌లో షేర్ చేయడంతో.. ఈ వీడియో వైరల్‌గా మారింది.
వియాత్నాంలోని నామ్‌దిన్హ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, పాపతో బైక్‌పై వెళ్తుండగా.. ఓ కారు ఓవర్‌టేక్ చేస్తూ.. వారిని తాకింది. దీంతో బైక్ వెనక కూర్చున్న తల్లి, పాప కిందపడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ఓ భారీ ట్రక్కు రావడంతో ఆ తల్లీకుమార్తె ట్రక్కు కింద పడిపోయినట్లే అనిపిస్తుంది. కానీ చక్రాల కింద పడబోతున్న కుమార్తెను చాకచక్యంగా వెనక్కి లాగింది తల్లి. అంతేకాదు తానూ ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
Mother of the year https://t.co/qIZlz1PYEZ
— Jofra Archer (@JofraArcher) April 25, 2022