Tamil Nadu : 50 రూపాయలకి చీర.. కరోనాని కూడా లెక్కచేయలేదు..!

Tamil Nadu : చీరలకి, స్త్రీలకి విడదీయరాని బంధం ఉంది. పండగ వచ్చిందంటే చాలు కొత్త చీర కొనుక్కోవాల్సిందే.. దాన్ని కట్టుకోవాల్సిందే.

Update: 2021-10-14 12:47 GMT

Tamil Nadu : చీరలకి, స్త్రీలకి విడదీయరాని బంధం ఉంది. పండగ వచ్చిందంటే చాలు కొత్త చీర కొనుక్కోవాల్సిందే.. దాన్ని కట్టుకోవాల్సిందే.. బేసిక్‌‌గా పండగల సమయంలో కస్టమర్స్‌‌ని ఆకట్టుకోవడానికి అటు షాపు యజమానులు కూడా బంపర్ ఆఫర్స్ అంటూ ప్రకటిస్తుంటారు. తాజాగా చెన్నైలో దసరా స్పెషల్ అంటూ రూ. 50కి కొత్త చీర అని అనౌన్సు చేశారు.

అలా అనౌన్సు చేశారో లేదో మహిళలు కరోనాను కూడా లెక్కచేయకుండా షోరూమ్ ముందు కిలోమీటర్ల వరకు లైన్లు కట్టారు. ఈ క్రమంలో మహిళల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. దీనితో అక్కడే వాగ్వాదానికి దిగారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేయడానికి నానా కష్టాలు పడ్డారు.

కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా తమిళనాడులో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1,280 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 19 మంది మరణించారు. 

Tags:    

Similar News