Viral News: కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. ఈ వయసులో ఇదేం పోయేకాలం: నెటిజన్స్ ఫైర్
Viral News: ఒంటరి మహిళ అయిన వాళ్లకి, బయట వాళ్లకీ అందరికీ లోకువే.. అవకాశం వస్తే ఆమెతో సంబంధం కొనసాగించాలనుకుంటారు.;
Viral News: ఒంటరి మహిళ అయిన వాళ్లకి, బయట వాళ్లకీ అందరికీ లోకువే.. అవకాశం వస్తే ఆమెతో సంబంధం కొనసాగించాలనుకుంటారు.. వయసుతో పనిలేదు.. ఎవరైనా ఏమన్నా అనుకుంటారన్న ఆలోచన అసలే లేదు.. మా పెళ్లి మా ఇష్టం అని మామా, కోడలు ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లో 70 ఏళ్ల వృద్ధుడు తన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మామ కైలాష్ యాదవ్ భార్య 12 ఏళ్ల క్రితం మరణించింది. వారికి నలుగురు సంతానం.
అందరికీ పెళ్లిళ్లయి ఎవరి జీవితాల్లో వారు స్థిరపడ్డారనుకున్న క్రమంలో మూడవ కుమారుడు ఆకస్మికంగా మృతి చెందాడు. దాంతో అతడి భార్య పూజ ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. పూజ తల్లిదండ్రులు ఆమెకు మరొక వివాహం చేసారు. అతడితో సరిపడక ఆమె మొదటి భర్త ఇంటికే వచ్చి ఉంటోంది.
ఈ క్రమంలోనే మామ కైలాష్ యాదవ్ కోడలు పూజను వివాహం చేసుకోవాలనుకున్నాడు.. ఇరువురు పరస్పర అంగీకారంతో దగ్గరలోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచన కానీ, కుటుంబ సభ్యుల మాటలు కానీ పట్టించుకోవాలనుకోలేదు..
కానీ కైలాష్ యాదవ్ పెళ్లి చర్చ సోషల్ మీడియా ద్వారా ఆ గ్రామం మరియు పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. వైరల్ అవుతున్న ఫోటో ద్వారానే ఈ వివాహం గురించి మాకు తెలిసిందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ బర్హల్‌గంజ్ చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పరస్పర ఒప్పందం. ఎవరికైనా దీనిపై అభ్యంతరం ఉంటే పోలీసులు దర్యాప్తు చేయవచ్చని అన్నారు. అనవసరంగా కల్పించుకునే హక్కు పోలీసులకు కూడా లేదని అన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జీవితాన్ని ఎందుకు తల్లీ నాశనం చేసుకుంటున్నావు అని పూజను తిట్టిపోస్తున్నారు.