వైరల్ : 36ఏళ్ల యువకుడిని పెళ్లాడిన 81ఏళ్ల వృద్ధురాలు!
ఫేస్‌బుక్‌లో పరిచయమైన 36 ఏళ్ల ఈజిప్ట్ యువకుడిని బ్రిటన్‌కు చెందిన ఐరిస్ జోన్స్ అనే 81 ఏళ్ల వృద్ధురాలు పెళ్లి చేసుకుంది.;
ఫేస్‌బుక్‌లో పరిచయమైన 36 ఏళ్ల ఈజిప్ట్ యువకుడిని బ్రిటన్‌కు చెందిన ఐరిస్ జోన్స్ అనే 81 ఏళ్ల వృద్ధురాలు పెళ్లి చేసుకుంది. అహ్మద్ ఇబ్రహీం అనే ఆ యువకుడు డబ్బుకోసమే తనను ప్రేమించాడని వస్తున్న విమర్శలను ఆమె కొట్టి పారేసింది. తన భర్త ప్రేమలో నిజాయతీ ఉందని ట్రోలర్స్‌కి గట్టిగా సమాధానమిచ్చింది. వారి ప్రేమను ఎవరూ నాశనం చేయలేరంది.
కాగా, తమ శృంగార జీవితమూ సాఫీగా సాగిపోతోందని చెప్పి.. నెటిజన్లకు ఈ బామ్మ షాకిచ్చింది. ప్రస్తుతం ఈజిప్ట్‌లో ఉన్న అతడు బ్రిటన్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, విమానాలు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయాడనిచెప్పుకొచ్చింది ఈ బామ్మ. తమ మధ్య ఎడబాటు గురించి కూడా ఆమె ఫీలయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.