మొసలి, చిరుత ఢిష్యుం.. ఢిష్యుం.. నాతో పెట్టుకుంటే కథ వేరే!
పులి రాకను గమనించిన మొసలికి కోపం వచ్చింది. నా అడ్డాకే వస్తావా.. ఎంత ధైర్యం నీకు.. నీ అంతు చూస్తా.. అంటూ నీళ్లు తాగుతున్న చిరుత మెడను కరుచుకొని ఆమాంతం నీటిలోకి లాక్కెళ్లింది.;
పులి పంజా విసిరిందంటే.. ఎంతటి మొనగడైనా సరే నేలకొరగాల్సిందే! చిరుత భూమిపై అత్యంత వేగంగా పరుగుతీసే క్రూర జంతువు..జింకను చిరుత పులి వేటాడుతుంటే ఎంత ఉత్కంఠగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. జింకను ఛేజ్ చేసేందుకు చిరుత వాయు వేగంతో దూసుకెళ్తుంది. ఇక చెట్లు ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలో చిరుతకు మించిన జంతువు మరొకటి లేదనే చెప్పాలి.
ఇక మొసలి పట్టు పట్టిదంటే.. వదిలించుకోవటం చాలా కష్టం. మొసలి నీటిలో ఉన్నప్పుడు దాని బలం ముందు ఎంతటి చిరుతైనా తలవంచాల్సిందే.. మొసలికి ఆహారం ఆవ్వాల్సిందే. మొసలి జాతిలోనే అతిపెద్దది నైల్ మొసలి. వీటి దాడి చాలా భయంకరంగా ఉంటుంది. మరి అలాంటి బలమైన నైల్ మొసలి అంతకంటే బలమైన చిరుతకు మధ్య పోరు జరిగింది. దాహంతో ఉన్న చిరుత నీటిని తాగేందుకు దగ్గరలోని ఓ నీటి కుంట వద్దకు వెళ్లింది. అప్పటికే ఆ నీటి లోపల 13 అడుగుల పొడవైన నైలు మొసలి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంది. పులి రాకను గమనించిన మొసలికి కోపం వచ్చింది. నా అడ్డాకే వస్తావా.. ఎంత ధైర్యం నీకు.. నీ అంతు చూస్తా.. అంటూ నీళ్లు తాగుతున్న చిరుత మెడను కరుచుకొని ఆమాంతం నీటిలోకి లాక్కెళ్లింది. కొన్ని క్షణాల్లోనే మొసలి మెరుపు దాడికి చిరుత బలైంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. దక్షిణాఫ్రికా వైల్డ్ ఎర్త్ సఫారి గైడ్ బుసాని మ్థాలీ.. అండ్ బియాండ్ ఫిండా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ వద్ద తీసిన మొసలి వర్సెస్ చిరుత పోరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.