Birthday Party For Pet Dog: పెట్ డాగ్ అంటే ఎంత ప్రేమ.. వంద కేజీల కేక్‌తో బర్త్‌డే పార్టీ..
Birthday Party For Pet Dog: జంతు ప్రేమికులు.. పెట్స్ ని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రాణంగా చూసుకుంటారు..;
Pet Dog Birthday Party: జంతు ప్రేమికులు.. పెట్స్ ని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. బర్త్ డే పార్టీలు చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తమ ఆనందాన్ని పంచుకుంటారు.
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తికి తన పెంపుడు శునకం క్రిష్ అంటే అపారమైన ప్రేమ. బెలగావికి చెందిన శివప్ప ఎల్లప్ప మరడి తన పెట్ క్రిష్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. అతడు తన పెట్ కోసం 100 కిలోల బర్త్‌డే కేక్‌ను కట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
క్రిష్ తలపై అందమైన పర్పుల్ క్యాప్‌ను ఉంచారు. పార్టీకి వచ్చిన అతిధులందరి మధ్య దాని చేత కేక్ కట్ చేయించారు శివప్ప. పార్టీకి వచ్చిన గెస్ట్‌ల చప్పట్ల మధ్య క్రిష్‌కి కేక్ తినిపించారు అతిధులు. ఈ సందర్భంగా దాదాపు 4000 మందికి అన్నదానం చేశారు. ఇందుకుగాను శివప్ప నెటిజన్ల హృదయాన్ని దోచుకున్నాడు.. అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు.