Lucknow: మలాయ్ స్వీట్ మధ్యలో ఎలుక జంప్ .. ఇంటర్నెట్ యూజర్స్ షాక్
అంద్ధాల బాక్సుల వెనుక అందంగా అలంకరించిన స్వీట్స్.. నోరూరిస్తుంటాయి స్వీట్స్ ప్రియులకు.. కానీ వాటి తయారీ విధానం చూస్తే వాక్ అంటారు.;
నవాబుల నగరమైన లక్నో కేవలం టూరిజం ప్లేసే కాదు. ముఖ్యంగా స్వీట్స్ ఇష్టపడే ప్రియులకు ఒక రుచికరమైన అనుభవాన్ని అందిస్తుంది. రాయల్ కేసర్ పెడ నుండి నోటిలో మెల్ట్ అయ్యే మఖాన్ మలై వరకు ఇక్కడ అత్యంత రుచికరమైన తయారీ కేంద్రంగా ప్రసిద్ధి.
ఒక ఫుడ్ వ్లాగర్ లక్నోలోని ప్రసిద్ధ మలై మఖాన్‌ను కలిగి ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ క్లిప్‌లో మలై మఖాన్ తయారీ ప్రక్రియలో, ఒక ఎలుక అకస్మాత్తుగా పదార్థాలు ఉంచిన టేబుల్ పైకి ఎక్కుతుంది. తయారీదారుడు దాన్ని తరిమినట్లు చూపిస్తుంది వీడియో.
ఈ వీడియో వైరల్ కావడంతో, చాలామందికి అసహ్యం కలిగింది.బాబోయ్ ఇవా మనం లొట్టలేసుకుంటూ తినేది అని అసహ్యించుకుంటున్నారు.. ఏదేమైనా ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్డే సేఫ్ అని అంటున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో సైతం సరుకులతో నిండిన కిచెన్ లో ఎన్ని జీవరాసులు పరిగెడుతుంటాయో ఎవరు చూశారు.. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వేడి వేడిగా కళ్ల ముందు కనిపిస్తుంటే అవేవీ గుర్తు రావు..
మరికొందరు వ్యంగ్యం ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “నీకు ధైర్యం ఉంది... అయినప్పటికీ, నువ్వు రీల్‌ను అప్‌లోడ్ చేశావు” అని ఒక వ్యక్తి ప్రశంసించాడు. "నా స్నేహితుడు దీన్ని తిన్నాడు. అతను ఇది నిజంగా రుచికరంగా ఉందని చెప్పాడు.... అవే అతని చివరి మాటలు" అని మరొకరు వ్యంగ్యంగా రాశారు."వారు ఎప్పటికీ గ్లౌజెస్ ఉపయోగించరు" అని మరొక వినియోగదారు ఎత్తి చూపారు."అదనపు రుచి ఇప్పుడే వచ్చింది," "కాబట్టి అతను ఎలుకను ఆహారం మీద నడవనిచ్చాడు, ఇంకా ఆహారాన్ని బయటకు విసిరేయకుండా తయారు చేస్తూనే ఉన్నాడు! వావ్. నాకు వాంతి చేసుకోవాలని ఉంది." అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు, ఈ వీడియో 1.6 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది.