Rakhi Sawant: వీధి కుక్కలకు పిచ్చెక్కించిన 'బిగ్ బాస్' బ్యూటీ డ్రెస్.. వీడియో వైరల్
అదిరేటి డ్రెస్సు మీరేస్తే అందరం మీ వెంట అన్నట్లుగా వీధి కుక్కలు రాఖీ సావంత్ వెంట పడ్డాయి.
Rakhi Sawant: అదిరేటి డ్రెస్సు మీరేస్తే అందరం మీ వెంట అన్నట్లుగా వీధి కుక్కలు రాఖీ సావంత్ వెంట పడ్డాయి. క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీగా పేరు పొందిన రాఖీ.. బిగ్ బాస్ సీజన్ 14 తర్వాత బాలీవుడ్లో అత్యంత వినోదాత్మక వ్యక్తిగా చాలా ఖ్యాతిని పొందింది.
14 వ సీజన్లో మంచి ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్న రాఖీ 15వ సీజన్లోకి కూడా తీసుకోవాలని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. స్పైడర్ మ్యాన్ గెటప్ వేసి ముంబై వీదుల్లో హల్ చల్ చేసింది. దీంతో దిగొచ్చిన బిగ్ బాస్ యాజమాన్యం 15వ సీజన్లోకి అవకాశం కల్పించారు.
హౌస్లోకి ఎంటరయ్యే ముందు అందరికంటే కాస్త డిఫరెంట్గా ఎంట్రీ ఇద్దామనుకుంది. బాగా ముస్తాబై భారీ డ్రెస్ ధరించి కారు దిగింది. అమ్మడిని చూసి అక్కడే ఉన్న కుక్కలు కూడా అవాక్కైనట్లున్నాయి. ఆమెనే అనుసరిస్తూ హౌస్ గేటు వరకు వెళ్లాయి. తన ఇన్స్టా పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేసింది రాఖీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని గంటల వ్యవధిలోనే రాఖీ వీడియోని లక్షల మంది లైక్ చేశారు. సరదాగా కామెంట్లు చేశారు.