Shoulder Dance Baby In Instagram: ఇన్‌స్టాగ్రామ్‌‌లో వైరల్ అవుతున్న ఈ పాప ఎవరో తెలుసా?

Shoulder Dance Baby In Instagram: సోషల్ మీడియా వల్ల ఎవరైనా ఎప్పుడైనా పాపులర్ అయిపోవచ్చు.

Update: 2021-11-30 03:07 GMT

Shoulder Dance Baby In Instagram: సోషల్ మీడియా వల్ల ఎవరైనా ఎప్పుడైనా పాపులర్ అయిపోవచ్చు. అప్పుడే పుట్టిన పాప దగ్గర నుండి సీనియర్ సిటిజన్ వరకు ఎవరినైనా సెలబ్రిటీని చేయగల కెపాసిటీ సోషల్ మీడియాకు ఉంది. అందులోనూ ఇన్‌స్టాగ్రామ్ ఇందులో ముందుంటుంది. ఇప్పటికే ఈ ఇన్‌స్టాగ్రామ్ వల్ల ఎందరో ఫేమస్ అయ్యారు. తాజాగా ఓ ఏడాది వయసున్న పాప నెట్టింట్లో తెగ ఫేమస్ అయిపోతున్నాడు.

స్విమ్మింగ్ పూల్‌లో టబ్‌లో కూర్చుని ముద్దుముద్దుగా డ్యాన్స్ చేసిన ఓ పాప వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా తన డ్యాన్సే కనిపిస్తోంది. చిన్నగా భుజాలను కదిలిస్తుంది.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో తను చేసిన డ్యాన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. సెలబ్రిటీలు సైతం తన వీడియోను ఉపయోగిస్తూ రీల్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఎవరు ఆ పాప అనుకుంటున్నారా..?

ఆ పాప పేరు లెయిన్. ఏడాది వయసున్న లెయిన్ తల్లి పేరు నిక్కీ జాన్‌స్టన్. నిక్కీ, లెయిస్ సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో డ్యాన్స్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది మెల్లగా వైరల్ అవుతూ తన కూతురిని ఫేమస్ చేసేసింది. సెప్టంబర్ 6న ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నిక్కీ. అది ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతోంది. ఈ వీడియోతో పాటు ఇందులో ఉపయోగించిన పాట కూడా అంతటా వినిపిస్తోంది.

ఈ పాప వీడియోను ఉపయోగిస్తూ సెలబ్రిటీలు పెట్టిన కొన్ని పోస్టులు..


Tags:    

Similar News