Tamil Nadu: కోతిని కాపాడాలని చాలా ప్రయత్నించాడు.. కానీ చివరికి..
Tamil Nadu: మామూలుగా సాటి మనిషికి సాయం చేయాలంటేనే వందసార్లు ఆలోచించే రోజులు ఇవి.;
Tamil Nadu: మామూలుగా సాటి మనిషికి సాయం చేయాలంటేనే వందసార్లు ఆలోచించే రోజులు ఇవి. ఇలాంటి సమయంలో కూడా మూగజీవులకు సాయం చేసేవారు, వాటిని ప్రేమగా చూసుకునేవారు ఉన్నారు. అలాగే కోతులను కూడా ప్రేమగా చూసుకునే మనుషులు ఉన్నారు. కాస్త వింతగా ఉన్నా.. ఇదే నిజం. ఇటీవల వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం.
తమిళనాడులోని పెరంబళూర్‌లో ఓ కోతిని వీధికుక్కలు వెంటపడి కరిచాయి. దీంతో ఆ కోతికి తీవ్ర గాయాలయ్యి రోడ్డు మీదే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన 38 ఏళ్ల ప్రభు వ్యక్తి దానికి తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. సీపీఆర్ ద్వారా మళ్లీ ఆ కోతి గుండే కొట్టుకునేలా ప్రయత్నించారు. కానీ అది జరగకపోవడంతో నోటితో దానికి శ్వాసను అందించే ప్రయత్నం కూడా చేశారు.
ఆ కోతిని కాపాడాలని ప్రభు పడిన తపనను ఎవరో వీడియో తీశారు. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో అతడిని అందరూ హీరో అంటూ పొగిడేస్తున్నారు. కానీ ప్రభు అంత తాపత్రయపడినా కూడా ఆ కోతి బ్రతకలేదు. వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా ఆ కోతి బ్రతకలేదు. కానీ కోతిని బ్రతికించాలని ప్రయత్నించిన ప్రభు మంచి మనసును మాత్రం అందరూ ప్రశంసిస్తున్నారు.
A 38-year-old man from #Perambalur tried to resuscitate a wounded monkey by breathing into its mouth. @NewIndianXpress @xpresstn #humanitywithheart pic.twitter.com/iRMTNkl8Pn
— Thiruselvam (@Thiruselvamts) December 12, 2021