తాను యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని హగ్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో మార్ఫింగ్ చేసిందంటూ క్లారిటీ ఇచ్చింది బాలీవుడ్ నటీమణి, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా. వాస్తవం తెలుసుకోకుండా.. అదే మార్ఫింగ్ ఫొటోని ఉప యోగిస్తూ ఓ వెబ్సైట్ దానిపై వార్త రాయడంపై షాక్ అయ్యానని పేర్కొన్నారు. ఈ నెల 18న రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రీతి వైభవు హగ్ చేసుకున్నారంటూ కొందరు నెట్టింట ఫొటో పోస్టు చేశారు. అదే విషయాన్ని ఓ గుజరాతీ వెబ్సైట్ ప్ర చురించగా నటి రియాక్ట్ అయ్యారు. అయితే మ్యాచ్ అనంతరం వైభవ్‌తో ప్రీతి మాట్లాడారు. అతడికి షేక్ హ్యాండ్ ఇస్తూ మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సరదగా ప్రీతి వైభవ్‌తో ముచ్చటించారు. ఈ వీడియో రాజస్థాన్ తమ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో కొందరు వీడియోలోని ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. ఈ ఫొటోలతో ఓ గుజరాతీ వెబ్సైట్ వార్త ప్రచురించింది. దీనిపైనే ప్రీతి స్పందించి, తాజాగా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ సహ యజమాని అయిన ప్రీతి ప్రత్యర్థి జట్టు సభ్యుడు వైభవ్ తో అలా ఎందుకు ప్రవర్తిస్తారనే చర్చ జరిగినా టెక్నాలజీ 'మాయ' అని తేలిపో యింది. అదే మ్యాచ్లో.. పంజాబ్ కింగ్స్ టీమ్ 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది.\