Uttar Pradesh: పోలీసుల నాగిని డ్యాన్స్.. వీడియో వైరల్..
Uttar Pradesh: దేశమంతా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది.;
Uttar Pradesh: దేశమంతా ఈసారి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. స్కూళ్లు, కాలేజీలు, గవర్నమెంట్- ప్రైవేట్ ఆఫీసులు.. ప్రతిచోట వైభవంగా వేడుకలు జరిగాయి. గల్లీగల్లీ మువ్వెన్నల జెండా ఎగిరింది. ఇండిపెండెన్స్ డే రోజు యూపీ పోలీసులు తమ టాలెంట్‌ను బయటకు తీశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగలా భావిస్తూ డాన్సులేశారు. పోలీసుల నాగిని డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎపుడూ డ్యూటీ టెన్షన్‌లో ఉండే పోలీసులు.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు సరదాగా గడిపారు. ఎస్సై పీక ఊదగా.. కానిస్టేబుల్ నాగిని అవతారమెత్తాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో పురాన్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. నిజానికి యూనిఫాంలో ఇలా డాన్స్ వేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం పోలీసుల డాన్సుకు ఫిదా అవుతున్నారు. ఎవరికైనా స్వాతంత్ర్య దినోత్సవం కంటే పెద్ద పండుగ ఏముంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
जब दारोगा जी बने सपेरा, नागिन कांस्टेबल को अपनी बीन पर नचाया।😂 pic.twitter.com/eVHCx3hJgo
— Jaiky Yadav (@JaikyYadav16) August 16, 2022