2015 సివిల్స్ టాపర్స్, కలెక్టర్ టీనా దూబె వీడియో ఒకటి వైరల్ అయింది. రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆమె పనిచేస్తున్నారు. ఓ రాజకీయ నేతకు ఈ యువ ఐఏఎస్ అధికారిణి ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ పునియా వాహనం నుంచి దిగగానే కలెక్టర్ టీనా దూబె తలవంచి వెంటవెంటనే నమస్కారం చేశారు. కాన్వాయ్ నుంచి దిగుతోన్న పునియా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం దిగుతుండగానే ఆమె చేతులు జోడించి నమస్కరించారు. ఆయన పట్టించుకోకుండా ఇంకా ఫోన్‌లో మాట్లాడుతుండగానే టీనా తలవంచి నమస్కారాలు చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన థ్యాంక్యూ.. థ్యాంక్యూ చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పారు. పూనియాకు టీనా దాబి వంగి వంగి నమస్కారం చేస్తోన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.