jangaon : అక్రమ సంబంధం.. అడ్డుగా భర్త.. చంపించేసిన భార్య..!
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో భార్య. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో చోటుచేసుకుంది.;
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో భార్య. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో చోటు చేసుకోగా.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్‌కు చెందిన ఆకుల మహేష్, అశ్వినికి ఏడాది క్రితం పెళ్లైంది. ఆటో నడుపుతూ జీవనం సాగించే మహేష్.. ఈనెల 5న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో ఫోన్ చివరి లోకేషన్ నమిలిగొండ అని చూపించింది. కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు పసుల కుమార్ అనే వ్యక్తిని విచారించారు. మహేష్‌ను మద్యం తాగించి తర్వాత ఎత్తుకెళ్లి నమిలిగొండలో హత్య చేసి.. బావిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు.