DR Congo: డీఆర్‌ కాంగోలో జైలులో 129 మంది మృతి

తొక్కిసలాటే కారణం;

Update: 2024-09-04 01:15 GMT

 జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి కాంగోలో 129 మంది ఖైదీలు మరణించారు. వీరిలో 24 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోయారని ప్రాథమిక అంచనా. సోమవారం కిన్షాసాలోని మకాల సెంట్రల్ జైలులో ఈ ఘటన జరిగింది.

 కాంగోలో ప్రధాన కారాగారం బద్దలు కొట్టడానికి ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో 129 మంది మరణించినట్టు మంగళవారం అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చునని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కిన్సాసాలోని మకాల కేంద్ర కారాగారంలో సోమవారం తెల్లవారుజామున జైలును బద్దలు కొట్టడానికి కొందరు ఖైదీలు ప్రయత్నించారని, ఈ సందర్భంగా హెచ్చరికగా గార్డులు జరిపిన కాల్పుల్లో 24 మంది ఖైదీలు, మిగిలిన వారు తొక్కిసలాటలో మరణించారని ఇంటీరియర్‌ మంత్రి జాక్విమిన్‌ షబానీ ఎక్స్‌లో తెలిపారు.

59 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని వివిధ ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. జైలులో కొంత భాగం దగ్ధమైనట్టు పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా కొంతమంది మహిళలపై అత్యాచారం జరిగింది. అయితే దీని గురించి మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరణించిన 129 మంది ఖైదీలా, ఇతరులు కూడా ఉన్నారా అనేది తెలియరాలేదు. కాగా, 1500 మంది సామర్థ్యమున్న ఈ జైలులో 12 వేల మంది ఖైదీలు ఉన్నట్టు ఆమ్నెస్టీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

 కాంగోలో ప్రధాన కారాగారం బద్దలు కొట్టడానికి ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో 129 మంది మరణించినట్టు మంగళవారం అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చునని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కిన్సాసాలోని మకాల కేంద్ర కారాగారంలో సోమవారం తెల్లవారుజామున జైలును బద్దలు కొట్టడానికి కొందరు ఖైదీలు ప్రయత్నించారని, ఈ సందర్భంగా హెచ్చరికగా గార్డులు జరిపిన కాల్పుల్లో 24 మంది ఖైదీలు, మిగిలిన వారు తొక్కిసలాటలో మరణించారని ఇంటీరియర్‌ మంత్రి జాక్విమిన్‌ షబానీ ఎక్స్‌లో తెలిపారు.

59 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని వివిధ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. జైలులో కొంత భాగం దగ్ధమైనట్టు పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా కొంతమంది మహిళలపై అత్యాచారం జరిగింది. అయితే దీని గురించి మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరణించిన 129 మంది ఖైదీలా, ఇతరులు కూడా ఉన్నారా అనేది తెలియరాలేదు. 

Tags:    

Similar News