France Unrest: 150 మంది నిరసనకారుల అరెస్ట్

Update: 2023-06-30 06:35 GMT



ఫ్రాన్స్ లో చెలరేగిన అశాంతి ని అదుపులోకి తీసుకురావడం కోసం 150 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రి గెరాల్డ్ డర్మానిన్ గురువారం తెలిపారు.




 


ఘర్షణల్లో అనేకమంది పోలీసు అధికారులు గాయపడ్డారని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్రెంచ్ లోని "రిపబ్లిక్ చిహ్నాలపైన, టౌన్ హాళ్లు, పాఠశాలలు దాడులు జరిగాయని, పోలీసు స్టేషన్లు తగులబెట్టబడ్డాయాని, అందుకే, 150 మంది నిరసనకారులను అరెస్టు చేయడం జరిగిందని", డర్మానిన్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా తెలిపారు.




 


పారిస్ ప్రాంతంలో 2,000 మంది పోలీసులను మోహరించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండవ రోజు అర్ధరాత్రి నాన్‌టెర్రే అవెన్యూ పాబ్లో పికాసోలో, పోలీసు లైన్ల వద్ద బాణసంచా కాల్చడంతో వాహనాలలు బోల్తాపడి కాలిపోయాయి. ఉత్తర నగరమైన లిల్లే మరియు నైరుతిలోని టౌలౌస్‌లో నిరసనకారులతో పోలీసులు ఘర్షణ పడ్డారు. ఫ్రెంచ్ రాజధానికి దక్షిణంగా ఉన్న అమియన్స్, డిజోన్ మరియు ఎస్సోన్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా అశాంతి ఉందని పోలీసు ప్రతినిధి తెలిపారు.

Tags:    

Similar News