చైనా బొగ్గు గనిలో ప్రమాదం.. 16 మంది మృతి
చైనాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్ మున్సిపాలిటీలో;
16 killed in china coal mine
16 killed, china, coal mine,
చైనాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్ మున్సిపాలిటీలో సాంగ్‌జౌ బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఎప్పటిలాగే పనిలోకి వచ్చిన కూలీలు.. ప్రమాదవశాత్తూ గనిలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి పెరుగడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 17 మంది ఈ గనిలో చిక్కుకోగా ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ బొగ్గు గనిని స్థానిక జిల్లా ప్రభుత్వం నడిపిస్తుంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.