Bangladesh:బంగ్లాదేశ్ బెదిరింపులు.. రాత్రి వేళ సరిహద్దుల్లోకి పరిగెత్తుకొచ్చిన హిందూ బాలిక
నర్ హిందూ బాలికకు మతోన్మాదుల బెదిరింపులు..;
షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అందులో మరీ ముఖ్యంగా హిందువులపై రోజురోజుకూ హింసాత్మక దాడులు పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. ఇస్కాన్ సంస్థ లక్ష్యంగా అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనలు యావత్ ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలో సంబంధం ఉన్న ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్‌ని, మరికొందరు హిందూ మత గురువుల్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు ఇక ఇటీవల ఈ ఉద్రిక్తతలు మరింత పెరగడం సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇస్కాన్‌కు చెందిన ఓ హిందూ బాలిక.. బంగ్లాదేశ్‌లో హిందువులు, వారి ఆస్తులు, ఆలయాలు, ఇళ్లపై దాడులు చేస్తుండగా వాటిని తట్టుకోలేక రాత్రి పూట భారత సరిహద్దులకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఆ బాలికను చూసిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-బీఎస్ఎఫ్ అధికారులు.. ఆమెను జువైనల్ కస్టడీకి అప్పగించారు.
ఇస్కాన్ భక్తురాలైన ఆ 17 ఏళ్ల మైనర్ బాలికను బంగ్లాదేశ్‌లోని మత ఛాందసవాదులు తీవ్రంగా బెదిరించారు. దీంతో ఆమె బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత సరిహద్దుల వద్దకు చేరుకుంది. రాత్రి వేళల్లో పరిగెత్తుకుంటూ వచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక బీఎస్ఎఫ్ అధికారులు ఆ బాలికను అదుపులోకి తీసుకుని పశ్చిమ బెంగాల్ అధికారులకు అప్పగించారు. బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా తమ కుటుంబాన్ని తీవ్ర బెదిరింపులతో భయం భయంగా బతుకుతోందని.. తమ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే దేశం వదిలి పారిపోయి వచ్చినట్లు అధికారులకు చెప్పింది. భారత్‌కు చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలియకుండానే తాను పరిగెత్తుకుంటూ వచ్చానట్లు తెలిపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని దినాజ్‌పూర్ జిల్లా సరిహద్దు నుంచి టీనేజ్ యువతి అక్రమంగా సరిహద్దు దాటిందని, కొంతమంది బంధువులు భారత్‌లో నివసిస్తున్నారని, వారి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పిందని పేర్కొన్నారు. బాలిక చెప్పిన విషయాలను అధికారులు పరిశోధిస్తున్నారు. సరిహద్దు దాటేందుకు ఎవరైనా సాయం చేశారా..? అనే కోణంలో విచారిస్తున్నారు. అమ్మాయికి జల్పాయిగురిలో బంధువులు ఉన్నట్లుగా తేలింది. బాలిక బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లా వాసి. కాలినడకన ఉత్తర దినాజ్‌పూర్ చోప్రా బ్లాక్‌లోని ఫతేపూర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ సమీపానికి వచ్చిన సమయంలో బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.