Abudabi : అబుదాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి..!
Abudabi : యూఏఈ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడి జరిగింది. దీంతో పెట్రోల్ ట్యాంకర్లు పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.;
Abudabi : యూఏఈ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడి జరిగింది. దీంతో పెట్రోల్ ట్యాంకర్లు పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో ఇద్దరు భారతీయులతో పాటు ఒక పాకిస్థాని చనిపోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు స్పష్టం చేశాయి. ఇరాన్ మద్దతుతో యెమెన్‌కు చెందిన హౌతిలు తామే దాడి చేసినట్ల ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం యూఏఈకి చెందిన షిప్‌ను హౌతిలు సీజ్ చేశారు. దీనిపై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే షిప్‌ను, అందులోని సిబ్బందిని సురక్షితంగా విడిచిపెట్టాలని కోరింది. యెమెన్‌లో కొద్దిరోజులుగా భద్రతా బలగాలకు, తిరుగుబాటు దారులకు మధ్య యుద్ధం నడుస్తోంది. 2015 నుంచి యెమెన్ భద్రతా బలగాలకు సౌదీ నేతృత్వంలోని అరబ్ కూటమి మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నారు.