ముగ్గురు పిల్లలను నిలబెట్టి కాల్చిన తండ్రి

అడ్డు వచ్చిన భార్య పరిస్థితి విషమం.;

Update: 2023-06-18 03:45 GMT

ఒక్కోసారి మనుషులు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవడం అసాధ్యం. ఆ పిల్లలకు ప్రేమను పంచాల్సిన తండ్రి మృగంగా మారాడు. అభం శుభం తెలియని తన సొంత కుమారులను వరుసగా నిలబెట్టి రివాల్వర్ తో కాల్చి చంపాడు. మనసుని మెలిపెట్టే ఈ ఘటన అమెరికాలోని ఒహియోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాడ్ డోర్‌మాన్ అనే వ్యక్తి మూడు, నాలుగు, ఏడు సంవత్సరాల వయసున్న తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రివాల్వర్ తో కాల్చి చంపాడు. తన ఇంట్లోనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

మూడు, నాలుగు, ఏడేళ్ల వయసులో ఉన్న ముగ్గురు కుమారులను, కుమార్తె ను మాటల్లో పెట్టి పెరట్లోకి తీసుకువెళ్లాడు. ఏం జరుగుతుందో ఊహించేలోపే వారిపై తుపాకులతో కాల్పులు ప్రారంభించాడు. పిల్లలను భర్త నుంచి కాపాడటానికి ప్రయత్నించిన భార్యను కూడా నిందితుడు రివాల్వర్ తో కాల్చాడు. తండ్రి ఇలా కొడుకులను చంపుతున్న సమయంలో కూతురు వీధిలోకి వచ్చి తమ తండ్రి తమ తమ్ముళ్లను చంపుతున్నాడంటూ అరవడం మొదలుపెట్టింది. దీంతో అటుగా వెళ్తున్న కొందరు ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన దారుణాన్ని చూసి షాక్ తిన్నారు. వాళ్లు వచ్చేసరికి నిందితుడు హాయిగా ఇంటి ముందు కూర్చొని ఉన్నాడని, పిల్లలు ముగ్గురు చినిపోగా.. భార్య కొన ఊపిరితో ఉందని పోలీసులు తెలిపారు.


 



నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాల్పులు జరిగిన ప్రతిసారి అమెరికాలో గన్ కల్చర్ పై చర్చ జరుగుతుంటుంది. దాదాపు 50 ఏళ్ళ కిందట అమెరికా అధ్యక్షుడు లిండన్ బైన్స్ జాన్సన్ అమెరికాలో నేరాల వల్ల మరణిస్తున్న వారిలో ఎక్కువ మరణాలు తుపాకుల వల్లే సంభవిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతే దీనికి ప్రధాన కారణం అన్నారు.

ఆ సమయంలో, అమెరికాలో దాదాపు 9 కోట్ల తుపాకులు ఉన్నాయి. కానీ నేడు, అంటే 50 సంవత్సరాల తరువాత, రెండు కాదు మూడు రేట్లు అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చినప్పుడల్లా ఇలా ఎందుకు జరుగుతున్నాయి, వీటిని ఎందుకు ఆపడం లేదన్న ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. 1968 నుంచి 2017 మధ్య, అమెరికాలో తుపాకుల వల్ల సుమారు 15 లక్షలమంది మరణించారు. ఒక సర్వే ప్రకారం 2020లోనే అమెరికాలో 45,000 మందికి పైగా తుపాకుల కారణంగా మరణానికి గురయ్యారు. ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. .

Tags:    

Similar News