Earthquake | ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.
సునామీ ముప్పు లేదన్న యూఎస్‌జీఎస్;
ఇండోనేషియాలోని తైమూర్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.34 గంటలకు తైమూర్ దీవులకు సమీపంలోని కుపాంగ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పశ్చివ నుసా టెంగారా ప్రావిన్స్ రాజధాని కుపాంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ముప్పు లేదని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ పేర్కొంది.
అర్ధరాత్రి వేల భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇండ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, 6.6 తీవ్రతతో భూమి కంపించిందని ఇండోనిషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
ఇండోనేషియా దేశంలో గురువారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తైమూర్ నగరంలో గురువారం సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో నమోదైంది. ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లో గురువారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
భూమి కంపిస్తున్నపుడు ఇళ్లలో నుంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ముప్పు లేదని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అంచనా వేసింది. ఇండోనేషియాలో ఈ భూకంపం వల్ల తక్షణం ఆస్తి నష్టం గురించి సమాచారం అందలేదు. పలు నగరాల్లో భారీ భూకంపం వల్ల ఇళ్లు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
భూకంపం సంభవించినప్పుడు కుపాంగ్‌లోని ఆస్టన్ హోటల్‌లోని హోటల్ అతిథులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని హోటల్ ఉద్యోగి శామ్యూల్ మలోహనా తెలిపారు. వంద మంది అతిథులు తమ గదులను విడిచిపెట్టి హోటల్ ముందు గుమిగూడారు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని భూకంపం, సునామీ కేంద్రం అధిపతి డార్యోనో చెప్పారు.