Suicide Attack: పోలీసు శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి

దిక్కు తోచని స్థితిలో దాయాది

Update: 2025-10-12 02:15 GMT

పురాణాల్లో భస్మాసురుడు  లాగానే ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఉంది. ఆయన సాధించుకున్న గొప్ప వరంతో తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకొని భస్మం అయినట్లు.. ప్రపంచంపైకి ఉగ్రవాదం అనే పెనుభూతాన్ని వదిలిన దాయాది దేశం ఇప్పుడు.. అదే ఉగ్రవాదంతో అష్టకష్టాలు పడుతుంది. తాజాగా లాహోర్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలు పాకిస్థాన్ స్వయంగా చేసుకున్న తప్పుల ఫలితం అంటున్నారు విశ్లేషకులు. తాజాగా హింసాత్మక ఘర్షణల వెనుక ఒకప్పుడు పాక్ సైన్యానికి ఇష్టమైన తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్థాన్ (TLP) అనే రాడికల్ సంస్థ హస్తం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

దాయాది పాకిస్థాన్‌  లో ఉగ్రమూక మరోసారి రెచ్చిపోయింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌  లోని ఓ పోలీసు శిక్షణా కేంద్రం పై ఆత్మాహుతి దాడికి   పాల్పడింది. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు మరణించారు. దాడి అనంతరం అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు టెర్రరిస్ట్‌లు  హతమయ్యారు.

డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాలోని రట్టా కులాచి పోలీసు శిక్షణా పాఠశాలపై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలు నిండిన ట్రక్కు శిక్షణ పాఠశాల ప్రధాన ద్వారాన్ని ఢీ కొట్టింది. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి ప్రతీకారంగా పోలీసులు ఆ ప్రాంతంలో కాల్పులు జరిపారు. ఈ ప్రతీకార కాల్పుల్లో తొలుత ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఆ ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న అనుమానంతో దాదాపు 5 గంటల పాటూ భద్రతా సిబ్బంది ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఇక ఈ ఘటనలో 13 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు శిక్షణా కేంద్రంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tags:    

Similar News