100th Great-Grandchild: 99 ఏళ్ల బామ్మగారు.. తన 100వ ముని మనవడిని చూసి మురిసిపోయారు..

100th Great-Grandchild: మనవళ్లు, మనవరాళ్లని చూసుకుని పొంగిపోని బామ్మలు ఎవరైనా ఉంటారా.. బోసి నవ్వులు చూసి మురిసిపోతారు.. అచ్చం మీతాత మాదిరిగానే ఉన్నావురా అని బుగ్గలు ఎరుపెక్కేలా సిగ్గుపడిపోతుంటారు.

Update: 2022-08-17 09:30 GMT

100th Great-Grandchild : మనవళ్లు, మనవరాళ్లని చూసుకుని పొంగిపోని బామ్మలు ఎవరైనా ఉంటారా.. బోసి నవ్వులు చూసి మురిసిపోతారు.. అచ్చం మీతాత మాదిరిగానే ఉన్నావురా అని బుగ్గలు ఎరుపెక్కేలా సిగ్గుపడిపోతుంటారు.యునైటెడ్ స్టేట్స్‌లోని పెన్సిల్వేనియాలో 99 ఏళ్ల వృద్ధురాలి పరిస్థితి కూడా అదే.. ఆమె తన 100వ మనవడిని కలుసుకుంది.

మార్గరీట్ కొల్లర్ ఒడిలో తమకు పుట్టిన బిడ్డను ఉంచారు తల్లిదండ్రులు. 1922లో పుట్టిన మార్గరీట్ సన్యాసిగా జీవితాన్ని గడపాలనుకున్నారు. కానీ విలియమ్స్ పరిచయంతో ఆమె ఆలోచనలు మారిపోయాయి. అతడిని పెళ్లి చేసుకుని ఒకరూ, ఇద్దరూ కాదు.. ఏకంగా 11 మంది పిల్లలను కనేశారు.

వాళ్లు పెరిగి పెద్దై పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో హాయిగా గడుపుతుండడంతో దంపతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేది.. 56 మంది మనవళ్లు, మనవరాళ్లతో ఉన్న తన పెద్ద కుటుంబాన్ని చూసి ముచ్చటపడుతుంటుంది మార్గరీట్.

తన 99వ ఏట ఆగస్ట్ 4న జన్మించిన 100వ మునిమనవడిని చూసే భాగ్యం కలిగింది బామ్మగారికి. ఈ గొప్ప కుటుంబంలో మరికొంత పిల్లలు చేరాలని ఆశపడుతోంది బామ్మ. ఆమె 100వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు కుటుంబసభ్యులు. 

Tags:    

Similar News