china: చైనాలో విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ విమానాలు
గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో మొదలు;
హాలీవుడ్ ఫిక్షన్ సినిమాల్లో వలె చైనావిద్యుత్ ఎయిర్ ట్యాక్సీ విమానాలను తీసుకొచ్చింది. అచ్చం హెలికాప్టర్ల ఉండే ఆ ఎయిర్ ట్యాక్సీలు గంటకు 200 కిలోమీటర్లు వేగంతో దూసుకెళ్లగలవు. తొలిసారిగా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆ ట్యాక్సీల్లో ప్రయాణించడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు. ఆ విద్యుత్ ఎయిర్ ట్యాక్సీల ప్రత్యేకతలెంటో ఈ కథనంలో చూద్దాం.
తొలిసారిగా చైనా ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించింది. అది కూడా పూర్తిగా పర్యావరణహితమైన విద్యుత్ విమానాలను తీసుకొచ్చింది. హెలికాప్టర్ల మాదిరి ఉండే ఈ ఎయిర్ ట్యాక్సీలకు ఎలాంటి రన్‌వై అవసరంలేదు. ఎలాంటి శబ్ధం లేకుండా ఆకాశంలోకి నేరుగా ఎగిరి.. గంటకు 200కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. అత్యధునిక సాంకేతికతో తీసుకొచ్చిన ఈ ఎయిర్ ట్యాక్సీలను గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్, జుహై ప్రాంతాల మధ్య చైనా నడిపిస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం 2గంటల నుంచి 20నిమిషాల వరకూ తగ్గినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఇందులో నలుగురు వరకూ ప్రయాణించవచ్చు. ఇందుకు 300యువాన్ల వరకు ఛార్జీలను వసూల్ చేస్తోంది. అత్యవసర సమయంలో ప్రయాణికులకు సహాయాన్ని అందించేంకు ఒక వ్యక్తిని సైతం ఏర్పాటు చేశారు. వీటిని మరింతగా అభివృద్ధి పరిచి చైనావ్యాప్తంగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ ట్యాక్సీల వల్ల గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో టూరిజం పెరిగినట్లు వెల్లడించారు. పర్యావరణహితమైన ఈ ఎయిర్‌ట్యాక్సల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు.