Alexa name stopped America: అక్కడ అలెక్సా.. ఇక్కడ సూర్యకాంతం.. పేరు పెట్టాలంటే..

Alexa name stopped America: విచిత్రంగా మార్కెట్లో అలెక్సా పేరుతో వచ్చిన ప్రోడక్ట్ బాగా పాపులర్ అయింది. కానీ అమ్మాయిలకు ఆ పేరుని పెట్టడం తగ్గించేశారు తల్లిదండ్రులు

Update: 2021-02-22 11:30 GMT

Alexa name stopped America

Alexa name stopped America అలెక్సా అమెజాన్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్. ఇది స్మార్ట్ ఫోన్లు మరియు ఎకో ఉత్పత్తుల యొక్క అమెజాన్ లైన్ల మీద ఉపయోగించవచ్చు. సాధారణంగా కంపెనీలు కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాటికి రకరకాల పేర్లు కూడా పెడుతుంటారు. అలా కొన్ని పేర్లు చాలా పాపులర్ అవుతుంటాయి. అలా పాపులర్ అయిన పేరే అలెక్సా. దీన్ని 2014లో అమెజాన్ మార్కెట్లోకి వచ్చిన వర్చువల్ అసిస్టెంట్.

అప్పటికే అమెరికాలో ఆ పేరు అందరి నోళ్లలో నానుతుండడంతో తన ప్రోడక్ట్‌కి ఆ పేరే బావుందని పెట్టేసింది అమెజాన్. ఇక అప్పటి నుంచి అది మరింత పాపులర్ అయ్యింది. అమెరికాలోని చాలా మంది చిన్నారులకు అలెక్సా అని పేరు పెట్టుకుని ముచ్చడపడుతుంటారు తల్లిదండ్రులు. విచిత్రంగా మార్కెట్లో అలెక్సా పేరుతో వచ్చిన ప్రోడక్ట్ బాగా పాపులర్ అయింది. కానీ అమ్మాయిలకు ఆ పేరుని పెట్టడం తగ్గించేశారు తల్లిదండ్రులు అని గణాంకాలు చెబుతున్నాయి.

2015లో అలెక్సా పేరుతో 6.052 మంది ఉండగా, 2019లో 1995 మంది మాత్రమే ఉన్నారు. 2015కు వచ్చేసరికి మరింత తగ్గి 139 మందికి మాత్రమే అలెక్సా అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మన భారతదేశంలో కూడా భయపడే పేరు ఒకటుంది. అదే అలనాటి అత్తగారు సూర్యకాంతం.. గయ్యాళి అత్తగా ప్రాచుర్యం పొందిన ఆమె మనసు మాత్రం వెన్న అని ఆమెతో కలిసి నటించిన ఆనాటి తారలంతా చెబుతారు. అందుకే ఈనాటి వరకు ఎవరైనా అరుస్తుంటే సూర్యకాంతంలా ఆ నోరేంటి అని అనడం పరిపాటైపోయింది. తమ పిల్లలకు ఆ పేరు పెట్టుకోవడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. దాంతో తెలుగునాట సూర్యకాంతం అనే పేరు తక్కువగానే వినిపిస్తుంది. ఆ విధంగా సూర్యకాంతం పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఎవరూ పెట్టుకోకపోయినా ఆ పేరుకున్న వ్యాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. 

Tags:    

Similar News