America : రష్యా వలన మా డ్రోన్ కూలిపోయింది

Update: 2023-03-15 01:41 GMT

నల్ల సముద్రంపై ఎగురుతున్న అమెరికా డ్రోన్ ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టిందని యూఎస్ ఆర్మీ తెలిపింది. తమ మానవ రహిత విమానం కూలిపోయిందని అమెరికా చెప్పింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ జేమ్స్ హెకర్ మాట్లాడుతూ MQ-9 అనే మానవ రహిత విమానం ( డ్రోన్ ) అంతర్జాతీయ గగనతలంలో తన రొటీన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పుడు రష్యాకు చెందిన ఫైటర్ జెట్ ఢీకొట్టిందని తెలిపారు. ఫలితంగా క్రాష్ జరిగి డ్రోన్ కూలిపోయినట్లు చెప్పారు. అమెరికాతో పాటు మిత్రరాజ్యాల విమానాలు అంతర్జాతీయ గగనతలంలో సురక్షితంగా పనిచేయాలని కోరారు.


మరో ప్రకటనలో..  రెండు రష్యన్ Su-27 ఫైటర్ జెట్ లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే MQ-9 కూలిపోయిందని అమెరికా తెలిపింది. ఇలాంటి చర్యలు రష్యా పనితీరును ప్రశ్నించే విధంగా ఉన్నాయని  అభిప్రాయపడింది. అంతర్జాతీయ గగనతలంలో మిత్రదేశాల విమానాలు ఎగురుతున్నప్పుడు రష్యా పైలట్లు జాగ్రత్తగా మసులుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలు అనుకోని తీవ్రతకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. MQ-9 రీపర్ డ్రోన్ లు అత్యంత ఎత్తులో నిఘా కోసం రూపొందించబడిన మానవరహిత విమానం.

Tags:    

Similar News