అర్థరాత్రి ఆఫీస్ వర్క్ అంతలోనే గుండెపోటు.. యూఎస్ లో మృతిచెందిన తెలంగాణ టెక్కీ..

వయసుతో పని లేదు.. ఆరోగ్యము, అనారోగ్యంతో సంబంధం లేదు.. ప్రాణాలను ఇట్టే హరించేస్తోంది గుండెపోటు.. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా గుండెపోటుకు గురవుతోంది.

Update: 2026-01-28 08:22 GMT

పదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న హర్షవర్ధన్ రెడ్డి గుండెపోటుకు గురై మరణించారు. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన ఆయన ఇంట్లోనే వర్క్ చేస్తుండగా మన సమయం ప్రకారం అర్థరాత్రి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ఆఫీస్ పని చేస్తుండగానే తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపే ఊపిరి ఆగిపోయింది. 

హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి సుదర్శన్‌రెడ్డి బొల్లారం గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థితిలో ఉన్న కుమారుడు ఇలా అకస్మాత్తుగా మరణించాడనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. హర్షవర్ధన్‌రెడ్డికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. హర్షవర్ధన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలు హర్ష వర్ధన్ కుటుంబానికి సహకరిస్తున్నారు. అతడి స్వగ్రామం అయిన బొల్లారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Tags:    

Similar News