AMERICA: అగ్రరాజ్యంలో షట్‌డౌన్ గందరగోళం

ఒక్కరోజే 5 వేలపైగా విమానాలు రద్దు... దేశ చరిత్రలోనే అత్యధిక కాలం షట్‌డౌన్.. జీతం లేకుండా పనిచేస్తున్న ఏటీసీ సిబ్బంది

Update: 2025-11-10 05:30 GMT

అమె­రి­కా­లో శు­క్ర­వా­రం ఒక్క రోజే 5,000కు పైగా వి­మాన సర్వీ­స్‌­లు రద్దు, ఆల­స్య­మ­య్యా­యి. షట్‌­డౌ­న్ కా­ర­ణం­గా ఎయి­ర్ ట్రా­ఫి­క్ తగ్గిం­చు­కో­వా­ల­ని వి­మా­న­యాన సం­స్థ­ల­కు సూ­చిం­చిన తొలి రోజే వేల సం­ఖ్య­లో వి­మాన సర్వీ­స్‌­లు రద్ద­య్యా­యి. ఇక రెం­డవ రోజు పరి­స్థి­తి ఇంకా దా­రు­ణం­గా ఉంది. అగ్ర­‌­రా­జ్యం అమె­రి­కా­లో ప్ర­‌­భు­త్వ ష‌­ట్‌­డౌ­న్ కొ­న­‌­సా­గు­తోం­ది. దేశ చరి­త్ర­లో­నే అత్య­ధిక కాలం కొ­న­సా­గు­తు­న్న షట్‌­డౌ­న్‌­గా ఇది చరి­త్ర సృ­ష్టిం­చిం­ది. ఈ షట్‌­డౌ­న్‌­తో లక్ష­లా­ది మంది అమె­రి­క­న్ల జీ­వి­తా­లు సం­క్షో­భం­లో చి­క్కు­కు­న్నా­యి. ఈ షట్‌­డౌ­న్‌ దే­శం­లో­ని పలు వి­మా­నా­శ్ర­యా­ల­పై తీ­వ్ర ప్ర­భా­వం పడిన వి­ష­యం తె­లి­సిం­దే. షట్‌­డౌ­న్‌ సమ­యం­లో ఎలాం­టి జీతం లే­కుం­డా పని­చే­స్తు­న్న ఎయి­ర్‌ ట్రా­ఫి­క్‌ కం­ట్రో­ల­ర్లు, టీ­ఎ­స్‌ఏ సి­బ్బం­ది అనా­రో­గ్య కా­ర­ణా­ల­తో వి­ధు­ల­కు గై­ర్హా­జ­ర్‌ కా­వ­డం­తో దే­శ­వ్యా­ప్తం­గా పలు వి­మా­నా­శ్ర­యా­ల­లో వి­మా­నాల రా­క­పో­క­లు ఆల­స్యం­గా జరు­గు­తు­న్నా­యి. దీం­తో ప్ర­‌­యా­ణి­కు­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు ప‌­డు­తు­న్నా­రు. పరి­మిత సం­ఖ్య­లో ఉన్న ఎయి­ర్‌ ట్రా­ఫి­క్‌ కం­ట్రో­ల­ర్స్‌­పై ఒత్తి­డి తగ్గిం­చ­డా­ని­కే ప్ర­‌­భు­త్వం వి­మాన సే­వ­‌­ల్లో కోత వి­ధిం­చిం­ది. ఈ వి­ష­‌­యా­న్ని దేశ రవా­ణా శాఖ మం­త్రి సీ­న్‌ డఫీ ఇటీ­వ­‌­లే ప్ర­క­టిం­చా­రు. దీని ప్ర­కా­రం దే­శం­లో­ని రద్దీ ఎక్కు­వ­గా ఉండే అట్లాం­టా, న్యూ­వా­ర్క్, డె­న్వ­ర్, చి­కా­గో, హ్యూ­స్ట­న్, లాస్ ఏం­జి­ల్స్ స‌హా 40 ప్రాం­తా­ల్లో 10 శాతం వి­మాన సర్వీ­సు­ల­ను రద్దు చే­యా­ల­ని ఫె­డ­ర­ల్ ఏవి­యే­ష­న్ అడ్మి­ని­స్ట్రే­ష­న్ ఆదే­శిం­చిం­ది. దీ­ని­ని శు­క్ర­వా­రం నుం­చి అమ­ల్లో­కి తీ­సు­కొ­చ్చా­రు. దీం­తో శు­క్ర­‌­వా­రం ఒక్క­‌­రో­జే దే­శం­లో 1000కి­పై­గా వి­మా­నా­లు ఆల­‌­స్య­‌­మ­‌­య్యా­యి. ట్రా­కిం­గ్ వె­బ్‌­సై­ట్ FlightAware ప్ర­కా­రం ని­న్న ఒక్క­‌­రో­జే ఏకం­గా 1,200 ఫ్లై­ట్లు ర‌­ద్ద­‌­య్యా­యి. ఇది గు­రు­వా­రం కంటే ఐదు రె­ట్లు ఎక్కువ. రే­గ­న్ జా­తీయ వి­మా­నా­శ్ర­యం­పై దీని ప్ర­భా­వం ఎక్కు­వ­గా పడిం­ది. 18శాతం అంటే 81 వి­మా­నా­లు రద్ద­య్యా­యి.

షి­కా­గో ఓ హే­ర్‌, అట్లాం­టా, డల్లా­స్, డె­న్వ­ర్‌ వంటి కేం­ద్రా­ల్లో కూడా 3% వరకు వి­మా­నా­లు రద్ద­య్యా­యి. వి­మా­నాల ర‌­ద్దు­తో ప్ర­‌­యా­ణి­కు­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు ప‌­డు­తు­న్నా­రు. గ‌­తం­లో ఇలాం­టి ప‌­రి­స్థి­తు­లు ఎప్పు­డూ చూ­డ­‌­లే­ద­‌­ని పే­ర్కొం­టు­న్నా­రు. సే­నే­ట్‌­లో రి­ప­‌­బ్లి­క­‌­న్లు ప్ర­వే­శ­‌­పె­ట్టిన ఫె­డ­‌­ర­‌­ల్ ని­ధు­ల­‌­కు చెం­దిన బి­ల్లు­కు ఆమో­దం ద‌­క్క­క­పో­వ­డం­తో అక్టో­బ­ర్‌ 1న అమె­రి­కా ప్ర­భు­త్వం షట్‌­డౌ­న్ ప్ర­క­టిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. ఈ షట్‌­డౌ­న్‌ నే­టి­తో 38వ రో­జు­కు చే­రు­కుం­ది. దేశ చరి­త్ర­లో­నే అత్య­ధిక కాలం కొ­న­సా­గు­తు­న్న షట్‌­డౌ­న్‌­గా ఇది చరి­త్ర సృ­ష్టిం­చిం­ది. ఈ షట్‌­డౌ­న్‌­తో లక్ష­లా­ది మంది అమె­రి­క­న్ల జీ­వి­తా­లు సం­క్షో­భం­లో చి­క్కు­కు­న్నా­యి. ఆహార సహా­యం­తో­పా­టు సా­మా­న్య ప్ర­జల ని­త్య జీ­వి­తం­లో­ని కీలక అం­శా­ల­కు సం­బం­ధిం­చిన కా­ర్య­క్ర­మా­ల­కు ప్ర­భు­త్వ ని­ధు­లు కో­త­ప­డ­గా వి­మాన ప్ర­యా­ణా­ల­లో ఆల­స్యా­లు, జీతం లే­కుం­డా వే­లా­ది మంది ప్ర­భు­త్వ ఉద్యో­గు­లు, కా­ర్మి­కు­లు పని­చే­స్తుం­డ­డం­తో ప్ర­జల జీ­వి­తా­ల­పై ఈ షట్‌­డౌ­న్‌ తీ­వ్ర ప్ర­భా­వా­న్ని చూ­పి­స్తోం­ది. ఇప్ప­టి­కీ ఇది ము­గి­సే అవ­కా­శా­లు కని­పిం­చ­డం లేదు. వి­మా­నాల రా­క­పో­క­ల­ను ట్రా­క్ చేసే ఫ్లై­ట్ అవే­ర్ వె­బ్‌­సై­ట్ ప్ర­కా­రం, శు­క్ర­వా­రం­తో పో­లి­స్తే శని­వా­రం రోజు వి­మాన సర్వీ­సు­లు ఎక్కు­వ­గా రద్ద­య్యా­యి. ఆ రెం­డు రో­జు­ల్లో చెరో 1000కి­పై­గా వి­మా­నా­లు క్యా­న్స­ల్ అయ్యా­యి. శని­వా­రం ఉదయం నుం­చి మధ్యా­హ్నం వ్య­వ­ధి­లో నా­ర్త్ కరో­లీ­నా రా­ష్ట్రం­లో­ని ఛా­ర్లో­టే నగర ఎయి­ర్‌­పో­ర్టు­లో 130 వి­మాన సర్వీ­సు­లు రద్ద­య్యా­యి. అట్లాం­టా, షి­కా­గో, డె­న్వ­ర్, నె­వా­ర్క్, న్యూ­జె­ర్సీ నగ­రా­ల్లో­ని వి­మా­నా­శ్ర­యా­ల్లో­నూ శని­వా­రం రో­జం­తా పె­ద్ద­సం­ఖ్య­లో వి­మాన సర్వీ­సు­లు క్యా­న్స­ల్ అయ్యా­యి. న్యూ­యా­ర్క్ సిటీ, దాని పరి­సర నగ­రా­ల­తో పాటు అమె­రి­కా­లో­ని పలు ఈస్ట్ కో­స్ట్ ఏరి­యా వి­మా­నా­శ్ర­యా­ల్లో­నూ సర్వీ­సు­లు రద్ద­య్యా­యి. పలు వి­మాన సర్వీ­సు­లు ఆల­స్యం­గా నడి­చా­యి.

Tags:    

Similar News