US vs China : అమెరికా vs చైనా.. టారిఫ్ వార్

Update: 2025-04-12 06:15 GMT

అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాలు మెట్టుదిగినా డ్రాగన్ కంట్రీ మాత్రం వెను కడుగు వేయడం లేదు. నిన్నటి వరకు అమెరికా ఉత్పత్తులపై చైనా 84% సుంకాలు విధించింది. అమెరికా వెనక్కు తగ్గకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఆ దేశంపై ఏకంగా 145% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకట నపై చైనా అంతే ఘాటుగా స్పందించింది. 84% ఉన్న టారిఫ్స్ ను 125%కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా ప్రయోజనాలను అమెరికా అణి చివేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చ రించడంతోపాటు తాము చివరి శ్వాస వరకు పోరాడతామని చైనా పేర్కొంది. సుంకం పెంపు అంశంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తొలిసారి స్పందించారు. ఈ వాణిజ్య యుద్ధంలో ఎవరూ గెలవరని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రపం చానికి వ్యతిరేకంగా వెళ్తే అమెరికా ఒంటవరుతు న్నందన్నారు. ఎవరు ఎన్ని చేసినా తమ దేశం భయపడబోదని స్పష్టం చేశారు. బీజింగ్లో స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవని అన్నారు. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

Tags:    

Similar News