Pak Defense Minister : అమెరికా వ్యాపారం కోసమే యుద్ధోన్మాదం : పాకిస్తాన్ రక్షణ మంత్రి

Update: 2025-05-26 07:30 GMT

పాకిస్థాన్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా గురించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణలకు కారణం అగ్రరాజ్యమే అనే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయి. తన ఆయుధ పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశపూర్వకంగా వివిధ దేశాల మధ్య ఘర్షణలను పెంచుతోందని ఆరోపించారు. ఇలాంటి యుద్ధాలతో అంతిమంగా లాభపడుతున్నది అమెరికాయేనని విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గత శతాబ్దంలో అనేక అంతర్జాతీయ సంఘర్షణ అమెరికా కేంద్రంగా ఉందని ఆసిఫ్ ఆరోపించారు. గత వందేళ్లలో అమెరికన్లు యుద్ధాలు సృష్టించారు. వాళ్లే స్వయంగా 260 యుద్ధాలు చేశారు.

అయితే, చైనా కేవలం మూ డు యుద్ధాల్లోనే పాల్గొంది అని గుర్తుచేశారు. డబ్బు సంపాదనే అమెరికా లక్ష్యమని, వారి జీడీపీలో సైనిక పరిశ్రమ వాటా అత్యధికమని అన్నారు. సరియా, ఈజిప్టు, లిబియా ఒకప్పుడు సంపన్నంగా ఉండేవి. కానీ దీర్ఘకాల యుద్ధాలతో నాశనమయ్యాయి. వీరి పతనం వెనుక అమెరికా హస్త ముంది. అగ్రరాజ్యం తన ఆయుధ పరిశ్రమ లాభాల కోసం రెండువైపులా ఆటాడుతుంది అని ఆసిఫ్ విమర్శించారు. నెట్టింట ఖ్వాజా వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఆయన ప్రకటనను స్వాగతిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ కు అమెరికా సైనిక సాయాన్ని ఎత్తిచూపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అనేకమార్లు ఈయన కీలక ప్రకటనలు చేశారు. అమెరికా, పశ్చిమదేశాల ప్రయోజనాల కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పారు. 

Tags:    

Similar News