నేనే అధ్యక్షుడిని.. దేశాన్ని తాలిబన్లకు అప్పగించను: అమ్రుల్లా
ఆఫ్గానిస్తాన్‌లో తిరుగుబాటు మొదలైంది. తాలిబన్లపై ఆఫ్గాన్ ఆర్మీ దాడులు చేస్తోంది. తాలిబన్లపై దాడులకు ఆదేశాలిచ్చిన;
ఆఫ్గానిస్తాన్‌లో తిరుగుబాటు మొదలైంది. తాలిబన్లపై ఆఫ్గాన్ ఆర్మీ దాడులు చేస్తోంది. తాలిబన్లపై దాడులకు ఆదేశాలిచ్చిన ఉపాధ్యక్షుడు అమ్రుల్లా.. తానే ఆఫ్గాన్ అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం పంజ్‌షీర్ ప్రాంతాన్ని ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పర్వాన్ ప్రావిన్స్‌లోని చారికర్‌ను ఆఫ్గాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఇక్కడి నుంచి తాలిబన్ బలగాలను వెనక్కు తరిమికొట్టింది. ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్ మొత్తం మ్మీద పంజ్‌షీర్, చారికర్ ప్రాంతాల్లో మాత్రమే ఆఫ్గాన్ జెండా ఎగురుతోంది. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఎదురుతిరుగుతున్నారు. తనకు మద్దతుగా నిలబడాలని ఇతర నేతలను కోరుతున్నారు.