టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ మాస్క్ తప్పనిసరి : రణ్‌దీప్ గులేరియా
టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ మాస్క్ తప్పనిసరని అన్నారు ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా.. ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు.;
టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ మాస్క్ తప్పనిసరని అన్నారు ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా.. ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు. వైరస్ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదని అన్నారు. ఈ క్రమంలో టీకాలు వేసుకున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని మార్గదర్శకాలలో చేర్చబోమని అన్నారు. అయితే ఏ వేరియంట్ బారి నుంచైనా మాస్క్, భౌతిక దూరం రక్షిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు. అటు కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు మాస్క్ అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకటించింది.