fuel tanker : ఆయిల్ కోసం ఎగబడ్డారు.. ఒక్కసారిగా పేలడంతో ...!
fuel tanker : పశ్చిమాఫ్రికాలోని సియారా లియోన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 91 మంది దుర్మరణం చెందారు.;
fuel tanker : పశ్చిమాఫ్రికాలోని సియారా లియోన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 91 మంది దుర్మరణం చెందారు. ఎక్కడ చూసినా... మృతదేహాలు, కాలిపోయిన శరీర భాగాలే కనిపిస్తున్నాయి. అక్కడి ప్రాంతమంతా రక్తసిక్తమయ్యింది. మంటల దాటికి అక్కడివారంతా తునాతునకలయ్యారు. ఒక్కక్షణం పాటు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. మంటల్లో కాలిపోతూ జనం పెట్టిన ఆర్తనాదాలు మిన్నంటాయి.
సియారా లియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. దీంతో ట్యాంకర్ నుంచి లీకవుతున్న ఆయిల్‌ను సేకరించేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఈ క్రమంలోనే ట్యాంకర్ ఒక్కసారిగా పేలి... పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడున్న షాపులకు సైతం అగ్నికీలలు వ్యాపించాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు కూడా మంటల్లో సజీవదహనమయ్యారు. మొత్తం 91 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ దుర్ఘటనలపై పశ్చిమాఫ్రికా అధ్యక్షుడు జూలియస్ మాడా బియో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు వెంటనే ఆదుకుంటామని ప్రకటించారు.