ఇవాళ లేజీ డే.. మీకు నచ్చినట్లు హ్యాపీగా..
పొద్దున్న లేసిన దగ్గర్నుంచి అందరం గడియారం కంటే వేగంగా పరుగు పెడుతుంటాము. కొద్దో గొప్పో బద్దకం ఉంటే పర్లేదంటున్నాయి;
కొద్దో గొప్పో బద్దకం ఉంటే పర్లేదంటున్నాయి అధ్యయనాలు. అప్పుడప్పుడూ శరీరం రెస్ట్ మోడ్‌లో ఉంటే ఆలోచనలు బావుంటాయట. లేజీనెస్‌లో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అందుకే ఆగస్టు 10ని లేజీడేగా ప్రకటించారట. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాము.
ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త ఉపశమనంగా..
పొద్దున్న లేసిన దగ్గర్నుంచి అందరం గడియారం కంటే వేగంగా పరుగు పెడుతుంటాము. టార్గెట్లు రీచ్ అవ్వాలి.. టైమ్‌కి అన్నం తినకపోయినా పర్వాలేదు. ఒక్క సెకను ఖాళీగా ఉంటే.. వామ్మో ఇంకేమైనా ఉందా.. ఈ టెన్షన్‌తో నిద్ర కూడా సరిగా పట్టని రాత్రులు. పడుకుంటే రిఫ్రెష్ అవుతాము కానీ శరీరానికి పునరుత్తేజం కావాలంటే మాత్రం కాస్త లేజీనెస్ అలవర్చుకోవాలంట.. శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లేజీనెస్ అంటే సినిమాలు, షికార్లు అంటూ తిరగడం కాదట.. నచ్చిన ఫుడ్ తిని నచ్చినట్టుగా పడుకోవడం. ఇలా చేయడం అంటే సమయాన్ని వృధా చేయడమే అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ రోజు మీరు లేజీగా ఉంటే రేపు మీ ఆరోగ్యం బావుంటుందని అంటున్నారు. అలా అని టైమ్‌కి తినకుండా మితిమీరిన బద్దకం ప్రదర్శిస్తే ఆరోగ్యానికి చేటే అని హెచ్చరిస్తున్నారు.
ఒక్క రోజు మీకోసం ఇలా..
ఛీ క్రేజీ.. లేజీగా ఉండాలా.. అని చెప్పిన మీ ఫ్రెండ్‌ని తిట్టకండి.. నెలకోసారి ఏమీ చేయకుండా హ్యాపీగా నచ్చినట్లు ఉండండి.. ఎక్కడ ఉన్నా ఏ సమస్యలూ లేకుండా, ఆలోచనలన్నీ పక్కన పెట్టి, అలారాన్ని ఆఫ్ చేసి, ఫోన్ పక్కన పడేసి ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తూ గడిపేయండి.. దీంతో మీరు మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని చెబుతున్నారు వైద్యులు, శాస్త్రవేత్తలు.
మనం చురుగ్గా ఉండేందుకు డోపమైన్ అనే ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొందరిలో దీని సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు దీనికి మందు రూపొందించే పనిలో ఉన్నారు. లేజీగా ఉన్న వ్యక్తులు ఆ పనిని సులువుగా చేసేందుకు మార్గాలు వెతుకుతారని అన్నారు. సృజనాత్మక అంశాలపై దృష్టిపెడతారని కొలరాడో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఏదైనా కష్టమైన పని చేయాలంటే నేను లేజీగా ఉండే వారినే ఎంచుకుంటాను. ఎందుకంటే వారే ఆ పనికి సులువైన మార్గాన్ని గుర్తించగలరు అని మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్ అంటారు.