బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ కన్నుమూత

ప్రపంచంలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానులలో ఒకరైన బహ్రెయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు..

Update: 2020-11-11 13:17 GMT

ప్రపంచంలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానులలో ఒకరైన బహ్రెయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యునైటెడ్ స్టేట్స్ లోని మాయో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు, ఇందులో బంధువులను మాత్రమే అనుమతిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని మృతితో వారం రోజులు దేశమంతటా సంతాప దినాలు ప్రకటించారు అధికారులు. అలాగే గురువారం నుంచి మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

Tags:    

Similar News