Muhammad Yunus : బంగ్లాకు విముక్తి.. కొత్త ప్రభుత్వ అడ్వైజర్, నోబెల్ గ్రహీత యూనస్ ప్రకటన

Update: 2024-08-07 09:00 GMT

బంగ్లాదేశ్ ఇప్పుడు స్వేచ్ఛను పొందినట్లు నోబెల్ గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనస్ తెలిపారు. హసీనా ఉన్నన్ని రోజులూ, ఇది ఆక్రమిత దేశంగానే ఉంటుందని, ఓ ఆక్రమిత శక్తిలా ఆమె వ్యవహరించారని, ఓ నియంతలా, ఆర్మీ జనరల్ గా, అన్నింటినీ ఆధీనంలోకి తీసుకున్నదని ఆరోపించారు.

బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పుడు విముక్తిని పొందినట్లు ఫీలవుతున్నారని ఓ ఇంటర్వ్యూలో యూనస్ పేర్కొన్నారు. హింస, విధ్వంసం, అల్లర్లు.. అన్నీ హసీనాపై కోపంతోనే జరిగినట్లు తెలిపారు. విధ్వంసం సృష్టించిన యువతే.. భవిష్యత్తులో దేశాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతిసారీ ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడడం వల్ల.. షేక్ హసీనాను రాజకీయంగా ఎదుక్కోవడం కుదరలేదని యూనస్ తెలిపారు.

30 శాతం రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం ఎవర్నీ పట్టించుకోలేదని, చర్చలు జరపకుండా.. మొండిగా యువతను అణిచివేసే ప్రయత్నం చేసిందని చెప్పారు. త్వరలోనే బంగ్లాదేశ్లో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

Tags:    

Similar News