Mehul Choksi : మెహుల్ చొక్సీ ఆచూకీపై బెల్జియం కీలక ప్రకటన

Update: 2025-03-27 05:45 GMT

వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో దర్జాగా బతికేస్తున్నాడు వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద 13 వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన మెహుల్ చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని బెల్జియం నిర్ధారించింది. ఇటీవల ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని, భార్య ప్రీతితో కలిసి ఆ దేశంలోనే నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయాన్ని బెల్జియం ప్రభుత్వం ధృవీకరించింది.

బెల్జియం విదేశాంగ మంత్రిత్వశాఖ ఛోక్సీ తమ దేశంలోనే ఉన్నట్లు తెలిపింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం ఛోక్సీ, నీరవ్‌ మోదీ దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోగా.. నీరవ్‌ మోదీ బ్రిటన్‌ జైలులో ఉన్నాడు. వీరిని భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

అయితే చోక్సీ ఉనికి తమకు తెలుసని, ఆయన మీద నమోదైన కేసు ప్రాముఖ్యత కూడా తెలుసని.. దీనిపై తాము శ్రద్ధవహిస్తున్నట్లు బెల్జియం విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మెహుల్ చోక్సీపై నమోదైన వ్యక్తిగత కేసుల గురించి తాము వ్యాఖ్యానించబోమని.. ఈ కేసులో ముఖ్యమైన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. మెహుల్ చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభించడానికి భారత అధికారులు ఇప్పటికే బెల్జియం అధికారులను సంప్రదించారని న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ కథనం అందించింది.

Tags:    

Similar News