BIDEN: అవును నా మనవరాలే...
నాలుగేళ్ల రాబర్ట్స్ తన మనవరాలే అని అంగీకరించిన బైడెన్;
తన కుటుంబ వ్యవహారాలపై కొన్ని రోజులుగా జరుగుతున్న విపరీత చర్చకు అమెరికా అధ్యక్షుడు బైడెన్(Joe Biden) తెరదించారు. నాలుగేళ్ల నేవీ జాన్ రాబర్ట్స్( 4-year-old named Navy Joan Roberts) తన మనవరాలేనని( 7th grandchild) అగ్రరాజ్య అధ్యక్షుడు అంగీకరించారు. ఆ పాప తన ఏడో మనవరాలని తేల్చి చెప్పి ఈ తతంగానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. తన కొడుకు హంటర్ బైడెన్, ఆయన భార్య లండెన్ రాబర్ట్స్(Hunter and an Arkansas )ల గారాలపట్టి నేవీ జాన్ రాబర్ట్స్ తన మనుమరాలేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంగీకరించారు.
ఈ అంశంపై అమెరికాలో కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జో బైడెన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ మనుమలందరికీ మంచే జరుగాలని కోరుకుంటున్నట్లు తాను, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కోరుకుంటున్నామని బైడెన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నా కొడుకు హంటర్ బైడెన్, అతడి భార్య లండెన్ రాబర్ట్స్ వారి కూతురి ప్రయోజనాల కోసం ఆమె ప్రైవసీని కాపాడుతూ ఉన్నారని బైడెన్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇది కేవలం కుటుంబ పరమైన అంశం మాత్రమేనని.. విమర్శలకు ఇక్కడ తావులేదని వెల్లడించారు. నేవీ జాన్ రాబర్ట్స్ పెంపకం బాధ్యతలపై ఆమె తల్లి లండెన్ లాబర్ట్స్ కోర్టులో పిటిషన్ వేయడంతో ఈ సంగతి బయట పడింది. కోర్టు తీర్పు మేరకు హంటర్ బైడెన్‌కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడంతో ఆ చిన్నారికి తండ్రి అని తేలింది. దీంతో నేవీ జాన్ రాబర్ట్స్ పెంపకం బాధ్యత హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్స్ చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
తన కుమారుడు హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్‌లకు 2018లో కలిగిన సంతానమే చిన్నారి నేవీ జాన్ రాబర్ట్స్ అని అంగీకరించిన బైడెన్, . హంటర్, లండెన్‌లు తమ కుమార్తె క్షేమం కోసం వారిద్దరి మధ్య సంబంధాలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.
ఇదేమీ రాజకీయ వ్యవహారం కాదని, కుటుంబ వ్యవహార మని స్పష్టం చేశారు. బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ 2021లో తాను రాసిన పుస్తకంలో లండెన్‌తో సంబంధం గురించి రాశారు. డ్రగ్స్‌కు బానిసగా ఉన్న సమయంలో ఆమె తన జీవితంలోకి వచ్చిందని ఆ తర్వాత ఆమెను మర్చిపోయానని ఆ పుస్తకంలో రాశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు పాప బాధ్యతను తాను కూడా తీసుకున్నానని అందులో రాసుకొచ్చారు. ఇంత జరిగినా అధ్యక్షుడు బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చిన్నారి నేవీని మనవరాలిగా స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు.