Bilawal Bhutto: మసూద్‌ అజార్‌ గురించి భారత్‌ సమాచారమిస్తే పట్టుకుంటాం- బిలావల్‌ భుట్టో

బిలావల్ భుట్టో జర్దారీ వింత వ్యాఖ్యలు;

Update: 2025-07-05 04:45 GMT

భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన జైష్-ఎ-మహమ్మద్ సంస్థ నేత మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధిపతి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్ సమాచారం ఇస్తే పట్టుకుంటామని వింతగా వ్యాఖ్యానించారు. బహుశా ఆప్ఘనిస్థాన్‌‌లో ఉండొచ్చేమోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ భాగంగా ఉంది.

ఇక లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు. పాక్‌ కస్టడీలో ఉన్నాడని చెప్పారు. ఇక మసూద్‌ అజార్‌ విషయానికొస్తే అతడు ఎక్కుడున్నాడో తమకు తెలియదన్నారు. బహుశా అతడు అప్ఘనిస్థాన్‌లో ఉండి ఉంటాడని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ పాక్‌ గడ్డ పైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు కచ్చితమైన సమాచారం ఇస్తే.. సంతోషంగా అతడిని అరెస్టు చేస్తామని.. కానీ న్యూడిల్లీ మాత్రం ఆ వివరాలు ఇవ్వదంటూ భుట్టో ఆరోపణలు చేశారు.

మసూద్ అజార్.. భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి దాడుల్లో సూత్రదారుడు. 2019లో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడు. 1999లో కాందహార్ హైజాక్ తర్వాత IC-814 ప్రయాణీకులకు బదులుగా అజార్ విడుదలయ్యాడు.

లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారతదేశం డిమాండ్ చేస్తోంది. పాకిస్థాన్ దగ్గర ఆధారాలు ఉన్నగానీ.. ఏమీ తెలియనట్టు నాటకాలు ప్రదర్శిస్తోంది.

Tags:    

Similar News