అఫ్గన్ రాజధాని కాబుల్‌లో మళ్లీ పేలుడు..!
అఫ్గన్ రాజధాని కాబుల్‌లో మళ్లీ పేలుడుతో దద్దరిల్లింది. కాబుల్ విమానాశ్రయమే లక్ష్యంగా దాడి జరిగింది.;
అఫ్గన్ రాజధాని కాబుల్‌లో మళ్లీ పేలుడుతో దద్దరిల్లింది. కాబుల్ విమానాశ్రయమే లక్ష్యంగా దాడి జరిగింది. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే దాడి జరిగింది. దాడిలో 13 మంది అమెరికా సైనికులు చనిపోయారు. ఈ నెల 22న ఆత్మాహుతి దాడిలో 183మంది మృతి చెందారు. దాడికి తామే కారణమని ఐసిస్ ప్రకటించింది. అటు... అఫ్గన్‌లో తాలిబన్ల హింసాకాండ కొనసాగుతోంది. జానపద గాయకుడిని తాలిబన్లు కాల్చి చంపారు. షరియా చట్టాన్ని నిర్బంధంగా అమలు చేస్తున్నారు. టీవీలు, రేడియోల్లో మహిళల వాయిస్ ప్రసారం చేయవద్దని హెచ్చరించారు.