Justin Trudeau: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం.. గట్టెక్కిన కెనడా ప్రధాని

ఊపిరి పీల్చుకున్న కెనడియన్ ప్రధాన మంత్రి ట్రూడో..;

Update: 2024-09-26 05:30 GMT

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు బిగ్ రిలీఫ్ దొరికింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ.. కన్జర్వేటివ్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా లిబరల్ పార్టీకి అనుకూలంగా 211 మంది ఓటేయగా.. మరో 120 మంది ప్రతిపక్షానికి సపోర్ట్ ఇచ్చారు. దీంతో ట్రూడో అవిశ్వాస తీర్మానంలో గెలిచారు. 338 సభ్యులున్న కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రస్తుతం లిబరల్స్‌కు 154 మంది ఉండగా.. కన్జర్వేటివ్‌ పార్టీకి 119, ఎన్డీపీకి 24, బ్లాక్ క్యూబోకోయిస్ పార్టీకి మరో 34 సీట్లు ఉన్నాయి. నో కాన్ఫిడెన్స్ మోషనల్‌లో గెలిచిన అనంతరం ప్రభుత్వ వ్యవహారాల ఇన్ చార్జ్ కరీనా గౌల్డ్ మాట్లాడుతూ..దేశానికి మంచి రోజు.. ఎందుకంటే కెనడియన్లు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను భావించడం లేదన్నారు.

ముందస్తు ఎన్నికలు జరపాలని కన్జర్వేటివ్‌ నాయకులు డిమాండ్ చేస్తూ.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో 211 మంది లిబరల్‌ పార్టీకి మద్దతుగా ఓటు వేశారు. దీంతో ప్రధాని ట్రూడో విజయం సాధించారు. అయితే ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా పడగొడతామని కన్జర్వేటీవ్‌లు హెచ్చరిస్తున్నారు.

‘ఈ రోజు దేశానికి మంచి జరిగింది. కెనడియన్లు ఎన్నికలు కోరుకుంటున్నారని నేను భావించడం లేదు. మేము వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతూ.. సమస్యల వారీగా చట్టాలు రూపొందిస్తున్నాం’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సీనియర్‌ లిబరల్‌ కరీనా గౌల్డ్‌ పేర్కొన్నారు

దేశంలో ప్రజల ఖర్చులు, పన్నులు, నేరాలు పెరిగాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ట్రూడో ప్రజల అవసరాలపై దృష్టిపెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తూ.. అనుభవజ్ఞులకు ఎక్కువ డబ్బు ఇస్తే డిసెంబర్‌ చివరివరకు అయినా ట్రూడోను అధికారంలో ఉంచుతామని బ్లాక్‌ నాయకుడు వైవ్స్‌- ఫ్రాంకోయిస్‌ బ్లాంచెట్‌ పేర్కొన్నారు.

కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ ప్రభుత్వం వెనుకంజలో ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుందంటూ స్థానికుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల మాంట్రియల్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ పరాజయం పాలైంది. ఇక, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ ఇబ్బందుల్లో పడటం ఖాయమని సర్వేలు ఉఠంకిస్తున్నాయి. 

Tags:    

Similar News