China-Iran : ఇరాన్ కు చైనా ఆయుధాలు!

Update: 2025-06-21 11:00 GMT

ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చైనా ఎవరికి మద్దతు గా నిలుస్తుందంటే ఏమాత్రం సందేహం లేకుండా వినిపించే సమాధానం ఇరాన్ వైపు అని. ఇప్పటికే చైనా ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించింది కూడా. అంతే కాదు చైనా రహస్యంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు బోయింగ్ విమానాల్లో ఇరాన్కు ఆయుధాలు తరలిపోతున్నట్లు సమాచారం. జూన్ 14 నుంచి దాదాపు ఐదు బోయింగ్ 747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి. అవి కజికిస్థాన్, ఉజ్బె కిస్థాన్, తుర్క్మెనిస్థాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ వైమానిక ప్రాంతానికి చేరుకున్నా యట. కానీ అక్కడి నుంచి అవి ఎటువెళ్లా యనేది తెలియలేదు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి ఈ విమానాల గమ్యస్థానాలు లక్సెం బర్గ్ అయినప్పటికీ.. అవి అసలు యూరోపి యన్ గగనతలంలోకి ప్రవేశించలేదు. మరో విషయం ఏమిటంటే.. సాధారణంగా ఈ రకం విమానాలను రవాణా కోసం వినియోగి స్తారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కు చైనా మిలిటరీ సాయం అందిస్తుందనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. చైనా నుంచి ఇరాన్ కు వెళ్తున్నట్లు అనుమానిస్తున్న బోయింగ్ 747 విమానాలతో తమకెలాంటి సంబంధం లేదని లక్సెంబర్గ్ కు చెందిన కార్గో విమానయాన సంస్థ కార్గోలక్స్ నిజానికి ఈ విమానాల గమ్యస్థానాలు లక్సెం వెల్లడించింది.

Tags:    

Similar News