China : చైనాలో మరో కొత్త వైరస్ కలకలం..!
China : కరోనాని ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది.;
China : కరోనాని ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. సాధారణంగా ఇది పక్షుల్లో కనిపిస్తుంది.కానీ ఈ వైరస్ మనుషులకి సంక్రమించడం తొలిసారి. ఇది ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని అక్కడి ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు.
సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న బాలుడు(4)కి ఈ వైరస్ సోకినట్లుగా తేలింది. అతడు జ్వరంతో పాటుగా ఇతర లక్షణాలతో బాధపడుతున్నట్లుగా అక్కడి అధికారులు తెలిపారు. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయని.. వాటివల్లే H3N8 వేరియంట్ అతనికి సోకిందని వైద్యులు తెలిపారు.
చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని, జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో బాధపడితే వెంటనే చికిత్స తీసుకోవాలని అక్కడి ప్రజలకి ఆరోగ్య శాఖా హెచ్చరించింది.