బ్రతుకు పోరాటంలో భార్యాభర్తలు.. గాలిలో విన్యాసం చేస్తూ పట్టుతప్పడంతో..
బ్రతకడానికి వారికి వచ్చిన కళే ఆధారమనుకున్నారు. కష్టపడుతూ, కష్టాలు పంచుకుంటూ ఒకరికొకరు తోడూ నీడగా నిలిచి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.;
బ్రతకడానికి వారికి వచ్చిన కళే ఆధారమనుకున్నారు. కష్టపడుతూ, కష్టాలు పంచుకుంటూ ఒకరికొకరు తోడూ నీడగా నిలిచి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రదర్శన ఇస్తున్న చోటే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త కన్నీరుమున్నీరయ్యాడు. వీక్షకుల చేత కంట తడి పెట్టించిన ఈ విషాద సంఘటన
సెంట్రల్ అన్హుయ్ ప్రావిన్స్‌లోని చైనాలోని సుజౌ నగరంలో చోటు చేసుకుంది. ఒక చైనీస్ అక్రోబాట్ లైవ్ షోలో వైమానిక నైపుణ్యం ప్రదర్శిస్తుండగా భార్య ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన వ్యక్తి విధినిర్వహణలో భాగంగా 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు జారినట్లు గుర్తించారు.
ఆమె తన భాగస్వామితో కలిసి ఫ్లయింగ్-ట్రాపెజీ అనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మహిళా ప్రదర్శనకారురాలు సేఫ్టీ లైన్‌లు వేసుకోక పోవడంతో పడిపోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. "చైనాలో ఎత్తైన విన్యాసాల సమయంలో భద్రతా నియమాల పటిష్టత గురించి చాలా చర్చలు జరుగుతున్నప్పటికీ అవి అమలు కావడం లేదు.
ఈ జంట భర్త జాంగ్ భార్య సన్, గతంలో కూడా సరైన భద్రతా చర్యలు లేకుండా హై-రిస్క్ ప్రదర్శనలు చేసిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదకరమైన ఇటువంటి విన్యాసాలకు వారికి ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. కానీ అది అన్ని వేళలా సరైనది కాదని ఈ సంఘటనతో రుజువైంది. ప్రాణాలకు తెగించే ప్రదర్శనలు ఎప్పటికైనా ప్రాణహాని కలిగిస్తాయనే విషయం మరోసారి తేటతెల్లమైంది.
A lot of discussions on Chinese socials today about the fatal accident that happened last night in Suzhou during a live acrobatic show. The female performer did not wear safety lines and she fell. She was rushed to hospital but passed away. (video end cut due to shocking content) pic.twitter.com/l5DCf0ilN1
— Manya Koetse (@manyapan) April 16, 2023