అంతర్యుద్ధంతో కాంగో భగ్గుమంటోంది. అతిపెద్ద నగరం గోమా తిరుగుబాటు దారుల వశమైంది. తూర్పు కాంగో నుంచి సామాన్య పౌరులు తరలిపోతున్నారు. అంతర్యుద్ధం మారణహోమానికి దారితీసింది. గోమా నగరం పరిసర ప్రాంతాల్లో రువాండా మద్దతున్న తిరుగుబాటుదారులకు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 773మంది మరణించారు. ఈ ఘటనతో దశాబ్దంగా జరుగుతున్న అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుతం కాంగో సైన్యం కొన్ని గ్రామాలను ఆధీనంలోకి తీసుకుంది. అయినప్పటికీ, ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంగో ప్రభుత్వ అధికార ప్రతినిధి పాట్రిక్ ముయామా ప్రకారం, గోమాలోని ఆస్పత్రులు, మార్చురీలలో 773 మంది మృతదేహాలను గుర్తించగా, 2,880 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తిరుగుబాటుదారులు నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను